_ ముగ్గురు పిల్లల కోరిక తీర్చనున్న అల్లు అర్జున్ | S/o Satyamurthy Trailer | S/O Satyamurthy | Allu Arjun S/O Satyamurthy | S/O Satyamurthy Audio Release Date | S/O Satyamurthy Movie Release Date | Amala Paul| Puri Jagannat

ముగ్గురు పిల్లల కోరిక తీర్చనున్న అల్లు అర్జున్

మన సినిమా హీరోలు, హీరోయిన్స్ తమను ఆరాధించే అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటారు. వారి అభిమానులకు ఏమన్నా ఆపదలు వస్తే వారికి ఆర్ధిక సహాయం చేస్తుంటారు. అలాగే వారి అభిమానులు ఎవరైనా చనిపోయే పరిస్థితులో ఉన్నారు అంటే వారిని బతికించడానికి, అలా కుదరలేదంటే చివరి కోరిక తీర్చడానికి ట్రై చేస్తారు. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్.టి.అర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్ లు చావు బతుకుల మధ్య ఉన్న తమ అభిమానులను కలిసారు. తాజాగా వీరి జాబితాలో అల్లు అర్జున్ కూడా వచ్చి చేరాడు. ఓ ముగ్గురు పిల్లలు అల్లు అర్జున్ ని చూడాలని కోరగా ఆయన వారిని కలవడానికి సిద్దమయ్యారు.

ఓ ముగ్గురు పిల్లలు తమ చివరి కోరికగా అల్లు అర్జున్ చూడాలని కోరారు. ఆ విషయాన్ని మేక్ ఎ విష్ ఫౌండేషన్ వారు అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్ళడంతో అల్లు అర్జున్ కూడా ఓకే అన్నాడు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆఫీస్ లో ఆ ముగ్గురు చిన్నారులను కలిసి వారితో కాస్త సమయం గడపనున్నాడు. ఈ విషయం ఆ పిల్లలకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆ ఫౌండేషన్ వారు అంటున్నారు. తమను అభిమానించే అభిమానులకు అండగా ఉండటానికి, వారికీ సాయం కావాల్సి వచ్చినప్పుడు వెనకాడకుండా ముందుకు వస్తారనే విషయాన్ని మన టాలీవుడ్ హీరోస్ మరోసారి ఋజువుచేసారు. ఇలాంటి ఓ మంచి పనిచేస్తున్న అల్లు అర్జున్ కి ఇడ్లెరెలx.cఒమ్ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాం.