_ బన్నీ తిరస్కరించిన 11 కోట్ల ఆఫర్ ! | S/o Satyamurthy Trailer | S/O Satyamurthy | Allu Arjun S/O Satyamurthy | S/O Satyamurthy Audio Release Date | S/O Satyamurthy Movie Release Date | Amala Paul| Puri Jagannat

బన్నీ తిరస్కరించిన 11 కోట్ల ఆఫర్ !

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ 11 కోట్ల బంపెర్ ఆఫర్ తిరస్కరించాడు అనే వార్తలు మీడియాలో హడావిడి చేస్తున్నాయి. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లాంటి టాప్ హీరోలు కూడ అంగీకరించిన ఈ ఆఫర్ ను అల్లుఅర్జున్ తిరస్కరించడం హాట్ న్యూస్ గా మారింది. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి బన్నీ ఇచ్చిన సమాధానం చుక్కలు చూపెట్టింది అని టాక్.

ఇక వివరాలలోకి వెళితే అమెరికాలోని ప్రముఖ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ అల్లుఅర్జున్ తో అమెరికాలోని ప్రముఖ నగరాలలో ఒక వారం రోజుల పాటు లైవ్ డాన్స్ షోలను నిర్వహించడానికి ప్లాన్ చేసి అతడికి పారితోషికంగా 11 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు టాక్. ఈ కార్యక్రమఒలో అల్లుఅర్జున్ తో పాటు కొంతమంది దక్షిణాదికి చెందిన యంగ్ హీరోలు, హీరోయిన్స్ ఉండేడట్లుగా ఈషోను ప్లాన్ చేసారు.

అయితే అల్లుఅర్జున్ ఈ ఆఫర్ కు ఎటువంటి ఆసక్తి ప్రదర్శించకుండా సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కార్యక్రమాలలో పాల్గొనడం తనకు ఇష్టం లేదు అని చెప్పడమే కాకుండా ఏదైనా సంస్థ ఛారిటీ కార్యక్రమాల కోసం ఇటువంటి ప్రోగ్రాంలను చేస్తే తాను డాన్స్ చేస్తాను కాని కేవలం కమర్షియల్ డాన్స్ ప్రోగ్రామ్ లలో పారితోషికాన్ని ఆశించి తాను లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇవ్వను అని ఆ సంస్థ నిర్వాహకులకు బన్నీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇదే సంస్థ గతంలో సల్మాన్ ఖాన్ తో ‘సలామ్ టూర్’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన నేపధ్యంలో ఇటువంటి ఆఫర్ ను బన్నీ వదులుకోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. విలువల కోసం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో కోట్లు వదులుకున్న బన్నీ పై ఆ పాత్ర ప్రభావం నిజ జీవితంలో కూడ ప్రభావితం చేసిందనే అనుకోవాలి..