_ చిరంజీవి స్పెషల్ బర్తడే | Chiranjeevi |Puri Jagannadh

చిరంజీవి స్పెషల్ బర్తడే

చిరంజీవి తన కమ్ బ్యాక్ ఫిల్మ్ అంటే 150 వ చిత్రం కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఆయన తన మెగా ఫ్యాన్స్ ని సంతోష పరచటానికి ఆయన రంగం సిద్దం చేసుకుంటున్నారు. అందులో బాగంగా ఆయన ఫొటో షూట్ చేసుకున్నారు. ఈ ఫొటో షూట్ ద్వారా తాను ఎలా 150 వ చిత్రంలో కనిపించ బోతున్నారో ట్రైలర్ లాగ ఇవ్వనున్నారన్నమాట.

అంతేకాదు ఈ నెల 22 న జరగనున్న పుట్టిన రోజు సెలబ్రేషన్స్ పోస్టర్స్, బ్యానర్స్ కోసం కూడా ఆయన ఈ ఫొటో షూట్ ఫొటోలు ఉపయోగించనున్నారు. ఎక్కడా తనలో గ్లామర్ తగ్గలేదని ఈ ఫొటోలు ద్వారా ఆయన ప్రూవ్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసిన మెగా ప్యాన్స్ ఆనందంలో తలమునకలు అవుతున్నారు.

ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఈ ఫొటోలో దర్శనమివ్వనున్నాయి. మెగా ఫ్యాన్స్ ఈ ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేయటానికి సిద్దమవుతున్నారు.

చిరు పుట్టిన రోజుకు మరిన్ని స్పెషల్ గిప్ట్ లు మెగా ఫ్యాన్స్ కు ఉండనున్నాయి. అవి...రామ్ చరణ్ కొత్త చిత్రం టీజర్, పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం సర్దార్ అఫీషియల్ ఫస్ట్ లుక్. ఇంకా మరిన్ని పుట్టిన రోజు విశేషాలు త్వరలో తెలియనున్నాయి.