Mahesh Babu









‘శ్రీమంతుడు’ సెన్సార్ ప్రస్తుతం ఘట్టమనేని అభిమానులతో పాటు, మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’తో ఈ సారి కచ్చితంగా సూపర్ హిట్ సినిమా ఇవ్వబోతున్నానని చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు కూడా మరో రెండు రోజుల్లో తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ వర్క్ ని ఫినిష్ చేయనున్నాడు. ఇప్పటికే మిగిలిన అందరి పాత్రల డబ్బింగ్ ఫినిష్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం ఫస్ట్ కాపీని సెన్సార్ కి పంపడానికి డేట్ ని ఫిక్స్ చేసింది. సెన్సార్ వారిచ్చిన సమాచారం ప్రకారం జూలై 31న ఈ సినిమా ని సెన్సార్ సర్టిఫికేట్ కోసం పంపనున్నారు. ఆ తర్వాత సెన్సార్ చెప్పిన మార్పులను మరియు ఏదన్నా లాగ్స్ ఉంటే వాటిని కట్ చేసి ఫైనల్ వెర్షన్ ఫస్ట్ కాపీని సిద్దం చేయనున్నారు. ఈ లోపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేలా ప్రొడక్షన్ టీం సన్నాహాలు చేస్తోంది. మహేష్ బాబు పుట్టిన రోజు స్పెషల్ గా రెండు రోజుల ముందే అనగా ఆగష్టు 7న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఆడియో మరియు ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

‘మిర్చి’తో డైరెక్టర్ గా తొలి హిట్ అందుకున్న కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నరెండవ సినిమా ‘శ్రీమంతుడు’. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, అంగన రాయ్, సనమ్ శెట్టి, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.