Mahesh Babu









శ్రీమంతుడుపై హాలీవుడ్ దాడి మహేష్ బాబు శ్రీమంతుడు గా రావడానికి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. మనకి తెలియసింది కేవలం రిజల్ట్ ఒక్కటే. ఆగష్టు 7న అది కూడా వచేస్తుంది. అయితే ఇంతలో మహేష్ బాబుకు చిన్న పిల్లలను, బారీ స్థాయి ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులను దూరం చేసే ఒక న్యూస్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాలు మన తెలుగు మరియు ఇతర ఇండియన్ చిత్ర పరిశ్రమలపై ఎంత ప్రభావం చూపిస్తున్నాయో తెలిసిందే. ఆ మధ్య ఫాస్ట్ అండ్ ది ఫ్యురియస్, ఆ తరువాత జురాసిక్ వరల్డ్ ఎలా బాక్స్ ఆఫీసు దగ్గర రేచ్చిపోయాయో చూసాం. ఇప్పుడు అదే తరహాలో టామ్ క్రూజ్ హీరోగా రూపొందిన మిషన్ ఇంపాజిబుల్: రోగ్ నేషన్ సినిమా వస్తోంది. ఇప్పటికే హాలీవుడ్లో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తున్న ఈ మూవీ ఇప్పుడు ఆగష్టు 6న ఇండియా లో కూడా రిలీజ్ అవుతోంది. చూస్తుంటే మహేష్ శ్రిమంతుడుకు ఎంతో కొంత పోటీ తప్పేలా లేదు.