Mahesh Babu









శ్రీమంతుడు ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ భారీ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయిన శ్రీమంతుడు, అన్ని థియోటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ అధరగొడుతుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అనేదానిపై బాక్సాపీస్ ట్రేడ్ పండిట్స్ ఓ లెక్కకు వచ్చారు.

దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న సినిమాలు అయితే, బాక్సాపీస్ వద్ద ఈజీగా సక్సెస్ ని సాధించటానికి ఆస్కారం ఉంటుంది. కాని ఓ సోషియల్ మెసేజ్ తో ఉన్న సినిమాని, బాక్సాపీస్ వద్ద సక్సెస్ చేయాలంటే అది ఎంతటి స టార్ హీరోకి అయిన కొద్దిగా సాహసంగానే ఉంటుంది. కాని, మహేష్ బాబు మాత్రం శ్రీమంతుడు మూవీతో సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయటం గ్యారెంటీ అని అంటున్నారు.

ఇదిలా ఉంటే శ్రీమంతుడు మూవీకి సంబంధించిన మొదటి రోజు బాక్సాపీస్ రిపోర్ట్ ప్రకారం, దాదాపు 18 కోట్ల రూపాయల వరకూ కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. బెనిఫిట్ షోస్ తోపాటు ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కి సంబందించిన టికెట్స్ కూడా ఇప్పటికే ఆన్ లైన్ లో అమ్ముడుపోయాయి.

ఈ మొత్తం కలెక్షన్ అన్ని కలుపుకొని, 18 కోట్ల రూపాయల షేర్ మార్క్ కలెక్ట్ చేస్తుందనిరిపోర్ట్స్ చెబుతున్నాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావటంతో రెండో రోజుకి థియోటర్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ఓవర్సీస్ లో కూడా మొదటి రోజు 1 మిలియన్ టచ్ చేస్తుందని అంటున్నారు.