Mahesh Babu









శ్రీమంతుడుకి భారీ ఓపెనింగ్‌? శ్రీమంతుడు టైటిల్‌ మరీ క్లాస్‌గా వుందని, పాటలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయని, దీనిపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించకపోవచ్చునని రకరకాలుగా దీనిని చిన్నచూపు చూసే ప్రయత్నం జరిగింది. కానీ శ్రీమంతుడు చిత్రానికి ఘన స్వాగతం ఖాయమనే సంగతిని స్పష్టం చేస్తూ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. మహేష్‌ గత రెండు చిత్రాలు పరాజయం పాలైనా కానీ, ఈ చిత్రం క్లాస్‌గా కనిపిస్తున్నా కానీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే దీనిపై వున్న ఆసక్తి ఏంటనేది స్పష్టమవుతోంది.

శ్రీమంతుడుకి భారీ ఓపెనింగ్‌ వస్తుందనేది ఖాయమైంది. పలు కేంద్రాల్లో ఫ్లాట్‌ రేట్లకి పర్మిషన్లు రావడంతో తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లోనే పదిహేను కోట్లకి పైగా షేర్‌ వస్తుందని అంచనాలున్నాయి. బాహుబలి రికార్డులని బ్రేక్‌ చేయకపోయినా కానీ ఓపెనింగ్స్‌ పరంగా శ్రీమంతుడుకి రెండో స్థానం ఖాయమని అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ట్రెండ్‌ చెప్తోంది. ఈ చిత్రానికి డీసెంట్‌ టు హిట్‌ రిపోర్టులు వస్తే కనుక ఈ బజ్‌తో సేఫ్‌ జోన్‌కి చేరుకోవడం అంత కష్టమేం కాదు. రెండు వారాల పాటు శ్రీమంతుడుకి ఫ్రీ స్పేస్‌ వుంటుంది కాబట్టి మంచి టాక్‌తో సంచలన విజయం ఖాయం చేసుకోవచ్చు.