Mahesh Babu









మహేష్‌ అంగీకరించాడు '1 నేనొక్కడినే' చిత్రానికి కల్ట్‌ ఫాలోయింగ్‌ వున్నా కానీ అది ఫ్లాపవడం మహేష్‌ని ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే దానిని సరిగ్గా ప్రమోట్‌ చేయలేదని మహేష్‌ అంగీకరించాడు. నిజానికి అది సైకలాజికల్‌ థ్రిల్లర్‌ అయినా కానీ దానిని ఆ విధంగా మార్కెట్‌ చేయలేదని, సరైన ఎక్స్‌పెక్టేషన్స్‌ బిల్డ్‌ చేయడంలో విఫలమయ్యామని మహేష్‌ చెప్పాడు. అంతే కాదు ఆ చిత్రానికి స్క్రీన్‌ప్లే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా తయారైందని, సరిగ్గా ఎడిట్‌ చేసుకుని విడుదల చేసి వుంటే సక్సెస్‌ అయ్యేదని దాంట్లోని ప్రధాన లోపాన్ని ఎత్తి చూపించాడు.

అదే విధంగా ఖలేజా చిత్రం టీవీలో సక్సెస్‌ అయి, థియేటర్లలో ఫెయిల్‌ అవడాన్ని కూడా మహేష్‌ ఎనలైజ్‌ చేశాడు. మూడేళ్ల విరామం తర్వాత తన నుంచి వచ్చిన చిత్రంపై వుండే అంచనాలని అది అందుకోలేకపోయిందని, అలాగే దానిని యాక్షన్‌ సినిమాగా ప్రమోట్‌ చేయడం కూడా పరాజయానికి కారణమైందని మహేష్‌ విశ్లేషించాడు. 'శ్రీమంతుడు' విషయంలో ఆ పొరపాట్లు జరగకుండా దీనిపై సరైన అంచనాలు ఏర్పడే విధంగా మహేష్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి కంటెంట్‌ కింగ్‌ అని, దీంట్లో స్టార్‌ పవర్‌ కంటే కంటెంట్‌ బాగుంటుందని మహేష్‌ పదే పదే చెప్తున్నాడు. దీనిపై రైట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడే విధంగా ట్రెయిలర్లు, పోస్టర్లు కూడా కేర్‌ఫుల్‌గా డిజైన్‌ చేస్తున్నారు.