Mahesh Babu









ఆ అభిమానులే నాకు బలం -మహేష్ బాబు నిజానికి హీరోలెవరైనా కూడా ఓ రేంజులో దూసుకుపోతున్నారంటే దానికి అభిమానులే కారణం. ముఖ్యంగా హీరోను అభిమానించడమే కాదు వారు హీరో చేసే ఎటువంటి ఫీట్ల నైనా ఎంకరేజ్ చేస్తారు. రజనీకాంత్ చేసే ఫీట్లు మరో హీరో చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు. కాని రజనీ చేస్తే మాత్రం శభాష్ అంటారు. అదే ఫ్యాన్సంటే. అయితే తనకి కూడా ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉన్న అభిమానులు ఉన్నారని చెబుతున్నాడు మహేష్ బాబు.

''నాన్నగారి అభిమానులకు ఒక క్వాలిటీ ఉంది. బాగా చేస్తే బాగా చేశానని చెబుతారు. ఒకవేళ చేయకపోతే సినిమా బాగాలేదని డైరెక్టుగా తిడతారు. ఇటువంటి అభిమానగణం నాకు ఉన్నందుకు ఎంతో ఆనందపడుతున్నా. అలాంటి స్ర్టయిట్ ఫార్వార్డ్ మనస్తత్వం ఉండే అభిమానులు ఉండటం అనేది పెద్ద ఎసట్టే'' అంటూ చెప్పుకొచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు సినిమా క్రెడిట్ అంతా తన అభిమానుల ఖాతాలోనే వేసే ఈ సిసలైన శ్రీమంతుడు. ఇకపోతే మొన్న కాకినాడలో కలసిన ఆ కుర్రాడి గురించి చెప్పుకొచ్చాడు. ''ఆరోగ్యం సరిగా లేని ఆ పిల్లాడు కూడా.. శ్రీమంతుడు చూశానండీ చాలా బాగుంది అని చెప్పాడు. అంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఇంకోటి ఉండదు'' అన్నాడు మహేష్. మొత్తానికి తన అభిమానుల గురించి ఈ సూపర్ స్టార్ నిజంగానే ఒక సూపర్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ నిజాయితీకి ఎవరైనా పడిపోవాల్సిందే.

శ్రీమంతుడు థ్యాంక్యూ మీట్ లో బాగంగా మహేష్ ఈ విషయాలను తెలియజేశాడు. శ్రీమంతుడు సినిమా కథను ఇంతగా ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సూపర్ స్టార్. అది సంగతి.