Mahesh Babu









శ్రీమంతుడు కి ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెలుగు ఇండస్ట్రీలో ఆరు అడుగుల అందగాడు.. క్యూట్ స్మైల్ తో ఇట్టే ఆకర్షించ గల హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ గా ఆగస్టు 7న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. పెద్ద ఎత్తున థియేటర్ల లో .. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ వద్ద పండుగ చేసుకునేందుకు మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ సినిమా కు సంబంధించి సెన్సార్ కొద్ది సేపటి క్రితమే పూర్తి చేసుకున్న శ్రీమంతుడికి సెన్సార్ వారు ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు.

మరో ట్విస్ట్ ఎమిటంటే సాధారణంగా సెన్సార్ బోర్డు వారు సినిమా చూసి సర్టిఫికెట్ జారీ చేయడం వరే పరిమితా కానీ శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత ఈ చిత్ర నిర్మాతలని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. నిర్మాతలు ముందుగా భావించినట్లే ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ రావడంతో వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇవ్వని ప్రమోషన్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.

ఇప్పటికే అన్ని చానల్స్ లో ఇంటర్వూలతో దుమ్మురేపుతున్నాడు. ఇక సినిమా హీరోయిన్ శృతి హాసన్ మరియు మిగిలిన టీం జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ తమిళ్లో కూడా తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నంగా తమిళంలో ‘సెల్వందన్’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు తమిళ వెర్షన్ ఆడియోని ఆగష్టు 4న చెన్నైలో రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.