Mahesh Babu









ఎవరూ నెంబర్ వన్ కాలేరూ: మహేష్ ప్రముఖ తెలుగు దిన పత్రిక నిర్వహించిన ‘మహేష్ ను అడగాలని ఉందా’ అన్న పిలుపుకు వేలాది సంఖ్యలో అభిమానుల నుండి ప్రశ్నలు రావడంతో ఆ పత్రిక మెయిల్ బాక్స్ నిండా నిముషానికి ఒక ప్రశ్న చొప్పున వచ్చి ఆ పత్రిక మెయిల్ బాక్స్ నిండి పోయింది. ఇక పోస్ట్ కార్డులు కవర్లకు అంతేలేదు అని టాక్. అలా సునామీలా వచ్చి పడిన ఆ ప్రశ్నలలోంచి కొన్ని ప్రశ్నలను ఎంపికచేసి మహేష్ చేత జవాబులు ఇప్పించింది ఆ ప్రముఖ పత్రిక.

ఈ నేపధ్యంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం పై సంచలన వ్యాఖ్యలు చేసాడు మహేష్. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో ఎవరూ నెంబర్ వన్ కాలేరని సినిమా స్టార్స్ కంటే సినిమా పెద్దది అయిపోయిందని ప్రతి శుక్రువారం ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాయే నెంబర్ వన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మహేష్. అంతేకాదు ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరూ అంటే తాను హీరోల పేర్లకన్నా రాజమౌళి పేరు చెపుతాను అంటూ కామెంట్ చేసాడు పిన్స్.

మరో అభిమాని పంచ్ డైలాగ్స్ ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పంచ్ డైలాగ్స్ తో సినిమాలు తీసే ట్రెండ్ అయిపోయిందని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు డైలాగ్స్ కోసమే సినిమాలు తీస్తే అవి ప్రేక్షకుల మెప్పు పొందలేవు అని కామెంట్ చేసాడు మహేష్.

ఇదే సందర్భంలో తనకు కోపం ఎప్పుడు రాదా అని మరో అభిమాని ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు పెళ్ళికాక ముందు విపరీతమైన కోపం ఉండేదని అయితే నమ్రత తన జీవితంలో ప్రవేసించాక తనను తాను కంట్రోల్ చేసుకుని ఎప్పుడూ నవ్వుతూ ఎలా ఉండాలో అనే సీక్రెట్ ను తనకు నమ్రత నేర్పింది అంటూ తన అందమైన నవ్వుకు నమ్రతే కారణం అంటూ కామెంట్ చేసాడు మహేష్. కృష్ణకు కొడుకుగా పుట్టడం దేవుడు ఇచ్చిన వరం అంటూ తన తండ్రిని ఆకాశానికి ఎత్తేశాడు మహేష్ బాబు. ‘శ్రీమంతుడు’ సినిమా పై అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తున్న నేపధ్యంలో రాబోయే ఆదివారం తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోబోతున్నాడు ఈ “శ్రీమంతుడు”..