Mahesh Babu









మహేష్‌ని పక్కన పెట్టిన రాజమౌళి? మహేష్‌బాబుతో ఒక సినిమా చేయాలని, దానికి అగ్రిమెంట్‌ జరిగిపోయిందని చెప్పి సూపర్‌స్టార్‌ అభిమానులకి పానకం లాంటి కబురు చెప్పాడు రాజమౌళి. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యేదీ ఇద్దరూ చెప్పడం లేదు. తమ ఇద్దరికీ సూట్‌ అయ్యే కథ కుదరాలని మహేష్‌ అంటుంటే, మహేష్‌కి ఎలాంటి కథ అయితే బాగుంటుందనేది తాను ఇంకా ఆలోచించలేదని రాజమౌళి చెప్పాడు. బాహుబలి రెండో భాగం షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఇక రాజమౌళి అదే పని మీద వుంటాడని, మహేష్‌తోనే తదుపరి చిత్రం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ రాజమౌళికి మాత్రం వేరే ప్లాన్స్‌ వున్నట్టున్నాయి.

బాహుబలి తర్వాత తను చేసే సినిమాకి యూనివర్సల్‌ అప్పీల్‌ వుండాలని రాజమౌళి భావిస్తున్నాడు. హిందీ, తమిళంలో తన మార్కెట్‌ని స్టాండర్డ్‌ చేసుకోవాలంటే తాను రీజనల్‌ సినిమాని దృష్టిలోంచి తీసేయాలని అనుకుంటున్నాడు. అందుకే ఈగకి సీక్వెల్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈగ 2 చేయాలనే ఆలోచన వున్నట్టు రాజమౌళి కూడా ప్రకటించాడు. బాహుబలి తర్వాత తనకి అదే కరెక్ట్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు కనుక అంతవరకు మహేష్‌ సినిమా వేచి చూడక తప్పదు.