శ్రీమంతుడుకు అంతటా పాజిటివ్ సెన్సారు పూర్తయిన దగ్గర నుంచి మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకు అంతటా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ సర్కిళ్లలో చాలా పాజిటివ్ డిస్కషన్ నడుస్తుండడం విశేషం. సాధారణంగా టాలీవుడ్ లో ఒకరు సూపర్ అంటే మరొకరు పెదవి విరిచేయడం కామన్. కానీ ఈ సినిమా కు సింగిల్ వెర్షన్ వినిపిస్తోంది.

మహేష్ చాలా అందంగా వున్నాడు..శృతి కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించింది.
సినిమాకు సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది. లుక్ చాలా రిచ్ గా వుంది. సినిమా నెరేషన్ కాస్త స్లో కానీ, ఎక్కడా గ్రిప్ తగ్గలేదు. ఇంట్రస్టింగ్ కలిగించేలాగే సాగింది.

ఇదీ శ్రీమంతుడు ఆఫ్టర్ సెన్సార్ బజ్. మరో 48 గంటల్లో సినిమా జనాల ముందుకు రానుంది. ఈ బజ్ ఏ మేరకు వాస్తవమో జనాలే చెబుతారు.