Mahesh Babu









సెన్సార్ కి సిద్దమైన ‘శ్రీమంతుడు’ టాలీవుడ్ ప్రముఖులతో పాటు, మహేష్ బాబు అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆగష్టు 7న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ కాపీ నిన్నటికి రెడీ అయ్యింది. ఈ చిత్ర టీం ఈ రోజు శ్రీమంతుడు సినిమాని సెన్సార్ కి పంపనున్నారు. సెన్సార్ వారు ఈ రోజు సాయంత్రం లోపు ఈ సినిమా చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఈ చిత్ర టీం ఈ సినిమాకి ‘యు/ఏ’ వస్తుందని ఆశిస్తున్నారు.

మరోవైపు ఈ చిత్ర టీం జోరుగా ప్రచారం చేస్తున్నారు. సినిమా విషయంలో ఎక్కడా లైట్ తీసుకోకుండా తెలుగు తమిళ భాషల్లో బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ తమిళ్లో కూడా తన మార్కెట్ పెంచుకునే ప్రయత్నంగా తమిళంలో ‘సెల్వందన్’ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే మహేష్ బాబు చెన్నై కి వెళ్లి సెల్వందన్ ఆడియో కూడా రిలీజ్ చేయనున్నాడు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘మిర్చి’ ఫేం కొరటాల శివ డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఆగష్టు 7న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.