Mahesh Babu









బెనిఫిట్‌ షోస్‌ తో బెదరగొడుతున్న శ్రీమంతుడు బాహుబలి చిత్రంపై వున్న అపారమైన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుని, ఆ చిత్రంపై పెట్టిన అమితమైన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి తొలి రోజు టికెట్ల ధరలని విచ్చలవిడిగా పెంచేశారు. రెగ్యులర్‌ షోస్‌ మాట ఎలా వున్నా కానీ బెనిఫిట్‌ షోస్‌కి టికెట్‌ రేట్స్‌ టూమచ్‌గా పెట్టారు. రెండు వేల రూపాయలకి కూడా వెరవకుండా బాహుబలి టికెట్లు కొనేశారు. దీంతో ఇక అన్ని సినిమాలకీ అదే పద్ధతి ఫాలో అయిపోయి సొమ్ము చేసుకోవాలనే అత్యాశ బిజినెస్‌ సర్కిల్స్‌లో కనిపిస్తోంది. శ్రీమంతుడు చిత్రానికి కూడా బెనిఫిట్‌ షోస్‌ టికెట్‌ రేట్లు చుక్కలు తాకుతున్నాయి.

ఎక్కడ షో ప్రకటించినా కానీ రెండు వేలకి తక్కువ రేటు చెప్పడం లేదు. ఎంత అభిమానులైనా కానీ మరీ అంత రేటుకి టికెట్‌ కొనాలంటే ఆలోచిస్తున్నారు. బాహుబలికి అమ్ముడైపోయాయి కనుక ఈసారి మాత్రం ఎందుకు అమ్ముడు కావన్నట్టు చెట్టెక్కి దిగడం లేదెవరూ. దీంతో ఒక రెండు గంటల ముందు వేసే బెనిఫిట్‌ షోస్‌ కంటే రెగ్యులర్‌ షోలకి వెళ్లడం ఉత్తమమని అనుకుంటున్నారు. ఈ ట్రెండుకి నిర్మాతలు, హీరోలు రంగంలోకి దిగి ఉన్నపళంగా బ్రేకులు వేయకపోతే దీని వల్ల లాభం కంటే సినిమా రంగానికి జరిగే నష్టమే ఎక్కువ వుంటుంది.