Mahesh Babu









శ్రీమంతుడికి యుఎస్‌లో టార్గెట్‌ @ మూడు మిలియన్లు బాహుబలి చిత్రానికి ఏడు మిలియన్‌ డాలర్ల వసూళ్లు రావడంతో తెలుగు సినిమాకి యుఎస్‌లో ఎంత స్టామినా వుందనేది క్లియర్‌ పిక్చర్‌ వచ్చేసింది. ఇంతకుముందు రెండు మిలియన్లు వస్తేనే వారెవ్వా అనుకునేవారేమో. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. యుఎస్‌లో ఫ్లాప్‌ సినిమాలతో కూడా మిలియన్‌ డాలర్లు వసూలు చేసే మహేష్‌బాబు ఇక రెండు మిలియన్లు సాధిస్తే పెద్ద విషయమేం కాదు.

శ్రీమంతుడు చిత్రానికి యుఎస్‌లో మూడు మిలియన్‌ డాలర్ల వసూళ్లు రావాలట. కింది స్థాయి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు దీనికి మూడు మిలియన్లు వస్తాయనే నమ్మకంతోనే ఆ రేంజిలో కొనేశారట. బాహుబలికి ఏడు మిలియన్లు వచ్చినపుడు ఈ మూడు మిలియన్లు తక్కువే అనిపించొచ్చు కానీ అదేమంత ఈజీ విషయం కాదు. బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వస్తే కనుక ఇంత రాబట్టడం కష్టం కాకపోవచ్చు కానీ ఒకవేళ యావరేజ్‌ అనిపించుకుంటే మాత్రం స్ట్రగుల్‌ తప్పదు.