NTR









ఫస్ట్ డే కలెక్షన్స్: SVSCని బీట్ చేసిన బాద్‌ షా

యంగ్ టైగన్ జూ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్‌ షా' అమెరికాలో రికార్డు స్థాయిలో విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం ఇక్కడ విడుదలైన ఈచిత్రం ఫస్ట్ డే అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. అంతే కాకుండా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫస్ట్ డే రికార్డును బద్దలు కొట్టి నెం.1 పొజిషన్‌కి చేరుకుంది.

బాద్‌ షా చిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బేనర్‌పై రూపొందించారు. దాదాపు రూ. 50 కోట్లకుపైగా బడ్జెట్‌తో గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ కావడంతో ఈచిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయ. దీంతో ఈచిత్రాన్ని అమెరికాలో దాదాపు 120 స్క్కీన్లలో భారీ ఎత్తున విడుదల చేసారు. ఇది వరకు మిర్చి చిత్రం ఇక్కడ అత్యధిక థియేటర్లలో విడుదల కాగా... ‘బాద్ షా' చిత్రం దాన్ని బీట్ చేసింది.

తొలిరోజు బాద్‌ షా చిత్రానికి ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతానికి అందిన 76 లొకేషన్స్ కలెక్షన్స్ రిపోర్టు ప్రకారం రూ. 1.29 కోట్లు($234,686) వసూలు చేసింది. పలు స్క్రీన్లకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇంత మొత్తంలో బిజినెస్ జరుగడం సూపర్ అంటున్నారు ట్రేడ్ నిపుణులు. పలు బాలీవుడ్ పెద్ద సినిమాల కంటే ‘బాద్ షా' కలెక్షన్స్ బెటర్‌గా ఉన్నాయని చెబుతున్నారు.

గతంలో మహేష్ బాబు, వెంకీ కాంబినేషన్లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తొలి రోజు.... $205,347 వసూలు చేసింది. తాజాగా ఆ రికార్డును ‘బాద్ షా' బద్దలు కొట్టింది. మరో వైపు ఇండియాలో బాద్ షా ఓపెనింగ్స్ కేకపుట్టిస్తున్నాయి. ఇరత ఫారిన్ కంట్రీలైన కెనడా, ఆస్ట్రేలియా, యుకె/యూరఫ్, మిడిల్ ఈస్ట్, టోక్యో, కెన్యా, టాంజానియా, సౌతాఫ్రియా, సింగపూర్లలో కూడా బాద్ షా అద్భుతమైన ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది.



Baadshah smashes E. Godavari Day 1 record


Baadshah expected to cross Million Dollar mark!


ఎన్టీఆర్‌కు బాలకృష్ట వార్నింగ్: జగన్ పార్టీపై ఫైర్


‘బాద్‌ షా’ క్రెడిట్ శ్రీను వైట్లదే: మహేష్ బాబు


Baadshah 1st Day Collections


‘బాద్ షా’ సినిమా హైలెట్స్ ఇవే...!


బాద్ షా క్యూలైన్లో తొక్కిసలాట: జూ ఎన్టీఆర్ ఫ్యాన్ మృతి


భారీ ఓపెనింగ్స్ సాధించిన 'బాద్‌ షా'


Congress Party Too Using Jr NTR Photos


Baadshah among Top 10 Grossers in USA


Sreenu Vaitla's Balancing Act


Bomb threat to Baadshah


YSRCP leads Jr NTR's 'Baadshah' celebrations


Baadshah In Top 10 Hollywood Grossers


Baadshah Movie Review @ 3.5/5