NTR









'బాద్‌ షా' రికార్డులు సృష్టిస్తుంది: షఫీ

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న బాద్‌షా ఘన విజయం సాధిస్తుందని సినీ నటుడు షఫీ ధీమా వ్యక్తం చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హార్సిలీహిల్స్‌సమీప గ్రామమైన నాయనబావికి రాత్రి షఫీ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ తాను బాద్‌షాలో మంచి పాత్రను పోషిస్తున్నానని, బలుపు, సహస్త్ర సినిమాలు నిర్మాణదశలో ఉన్నాయన్నారు.

కన్నడలో నిర్మిస్తున్న డర్టీ పిక్చర్‌ సినిమాలో వైవిధ్య భరితమైనపాత్ర దొరికిందని, త్వరలోనే ఈ సినిమా విడుదల కానుందన్నారు. చిరంజీవి మేనల్లుడితో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమాలోనూ నటనకు ఆస్కారమున్న వేషం వేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని, త్వరలోనే జీవ వైవిధ్యంపై మదనపల్లెలో ఓ సదస్సు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే యాభై కోట్లు పై చిలుకు అయ్యిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వాడిన సూట్ ఖరీదు హాట్ టాపిక్ గా మారింది. ఈ సూట్ ని ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసారని, మీటర్ కి ఒక లక్ష ఖర్చైందని చెప్తున్నారు. కేవలం ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు వాడిన కాస్ట్యూమ్స్ కాస్ట్ ..మూడున్నర కోట్లు ఖర్చైందని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికే 55 కోట్లు దాటిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ట్రేడ్ లో ఈ చిత్రానికి ఏ రేంజిలో బిజినెస్ జరగనుందనే విషయంపై చర్చలు ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఎన్టీఆర్ పై అంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని కొందరు సందేహం వ్యక్తం చేసినా, శ్రీను వైట్ల కాంబినేషన్ కాబట్టి నష్టముండదు అంటున్నారు.