- రామయ్యకు అగ్ని పరీక్ష | Ramayya Vastavayya First Day collections| Ramayya Vastavayya first day collections | Ramayya Vastavayya first day collections vs Attharintiki Daaredhi first day collectionsNTR | Junior NTR | Nandamuri Family | New Movies | Reviews | Songs | Wallposters

Share |

రామయ్యకు అగ్ని పరీక్ష

రామయ్య మరో అగ్నిపరీక్షకు సిద్దమయ్యాడు, కాలం కలిసిరాకపోతే తాడే పామై కాటేస్తుంది అంటారు, ఇదే సామెత ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది అంటున్నారు. ఇప్పటికే తండ్రి హరిక్రిష్ణ నిర్వాకంతో ఆయన సినిమా ఆడడంపై తెలంగాణలో నీలినీడలు కమ్ముకున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక సీమాంద్రలో గట్టెక్కుదాం అనుకుంటే సమ్మె షాకిస్తోంది, ఆర్టీసి బంద్ తో పల్లె జనం పట్నం వచ్చి సినిమాలు చూసే పరిస్తితులు అక్కడ సన్నగిల్లాయి. ఇక ఉద్యోగులకు జీతాలు లేక సినిమాలు చూసి ఎంజాయ్ చేసే పరిస్థితి మెజార్టి ఉద్యోగులకు లేదు. ఇక పనులు కూడా లేక సాధారణ జనజీవనం కూడా అక్కడ స్థంబించి పోయింది.

ఇది చాలదన్నట్టు సీమాంద్రకు తుఫాను హెచ్చిరిక జారీ అయింది, ఇది సీమాంద్రలోని మెజార్టి ప్రాంతాలను ముంచెత్తుతుంది అంటున్నారు. ఇప్పటికే సముద్ర తీరాల వద్ద రెండో ప్రమాద హెచ్చిరిక కూడా జారీ అయింది. ఇక భారీ వర్షాలు సీమాంద్రను ముంచెత్తుతాయి అంటారు, ఇదే జరిగితే ఎన్టీఆర్ రామయ్యకు కష్టం వచ్చిపడ్డట్టే అంటున్నారు.