NTR









'బాద్ షా'పై ఒరిజినల్ టాక్ ఇదే..!

‘బాద్ షా’ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. క్లీన్ ఎంటర్ టైనర్ గా శ్రీను వైట్ల ఈ సినిమాను తెరకెక్కించినట్లు సెన్సార్ బోర్టు సభ్యులు ప్రశంసించినట్లు చెబుతున్నారు. ‘బాద్ షా’ సినిమా బంపర్ హిట్ అనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘బాద్ షా’ ను ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సోమవారం నాడు ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా బాగా వచ్చినట్లు టాక్ వస్తుంది. కామెడీ, యాక్షన్ మేళవించిన తీసిన ఈ సినిమాను కుటుంబసమేతంగా చేసేవిధంగా శ్రీను వైట్ల రూపొందించనట్లు చెబుతున్నారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదని అంటున్నారు. సెకండాఫ్ లో వచ్చే కామెడీ సీన్లుకు చూసే వారి పొట్టలు పగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఫస్టాఫ్ సాధారణంగా ఉన్నా... సెకాండ్ ఆప్ లో శ్రీను వైట్ల విజృంభించాడని వార్తలు వస్తున్నాయి. కడుపుఉబ్బా నవ్వించే కామెడీ సీన్లు, అదరిపోయే యాక్షన్ పార్ట్స్ సెకాండ్ ఆఫ్ లో కనువిందు చేస్తాయని సమాచారం. వీటి కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ బాద్ షా ను చూస్తారని చాలా ధీమాగా చెబుతున్నారు.

ఇక, ఎన్టీఆర్ పాత్రను గోప్యంగా ఉంచుతున్నా అతని ప్రదర్శన సినిమాను సూపర్ హిట్ స్థాయికి తీసుకుని వెళ్ళుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎమోషనల్, యాక్షన్ సీన్లు గుర్తుకు వస్తాయి. అయితే ఈ బాద్ షాతో ఆ రెండిటితో పాటు కామెడీకీ ఈ బుడ్డోడు గుర్తుండిపోతాడని అంటున్నారు. తమన్ మ్యూజిక్, శ్రీను వైట్ల మేకింగ్, జూనియర్ ఎన్టీఆర్ డాన్సులతో బాద్ షా చిత్ర పాటలు కలకాలం గుర్తుండిపోతాయిన చెబుతున్నారు. సినిమా చాలా రిచ్ గా వచ్చిందని, ప్రతీ ఫ్రేమ్ లో బండ్ల గణేష్ ఖర్చు చేసిన భారీతనం కనిపిస్తుందని అంటున్నారు.

‘బాద్ షా’ టాలీవుడ్ లో మరో రికార్డు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు.