NTR

ఎన్టీఆర్ ఫ్యాన్ కి హరీష్ శంకర్ ఘాటు రిప్లై

గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తో మంచి జోరు ఉన్న దర్శకుడు హరీష్ శంకర్. ఆయన రీసెంట్ గా ఎన్టీఆర్ అభిమాని ఒకరికి ట్విట్టర్ లో ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమాని..హరీష్ ని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ...ట్విట్టర్ లో ఈ సోది ఆపి తారక్ సినిమాకి స్క్రిప్టు సరిగా రాయి. గబ్బర్ సింగ్ ప్లాప్ అయ్యిందని బాధ పడకు. మా తారక్ నీకు హిట్ ఇస్తాడు అని రాసారు. దానికి హరీష్ రిప్లై ట్వీట్ ఇస్తూ...నువ్వు ఏ మెంటల్ హాస్పటిల్ లో ఉన్నా నేను వచ్చి చూస్తాను. త్వరలోనే నువ్వు కోరుకుంటావని ఆశిస్తున్నాను అని ..గూబ గుయ్యమనేలా రిప్లై ఇచ్చారు.ఇక ఎన్టీఆర్, హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందబోయే చిత్రానికి 'ఎంఎల్.ఏ' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి(ఎం) లక్షణాలు(ఎల్)ఎ(అబ్బాయి) అని దర్శకుడి భావమట. టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. అలాగే పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారని వినికిడి. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.