NTR









‘బాద్ షా’ సినిమా హైలెట్స్ ఇవే...!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొత్త సినిమా ‘బాద్ షా’. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా మొదటి రోజునే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవి మీ కోసం :

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పోషించి పాత్ర పోషణ అభిమానులు మెప్పిస్తుంది. అలాగే అతను చెప్పిన ప్రతీ డైలాగ్ కు చప్పట్లు పడుతున్నాయి. అలాగే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ మిగిలిన విషయాలు కూడా ఉన్నాయి. అవి... హీరో సిదార్థ గురించి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కామెంట్లు చేశాడు. (హీరో సిద్ధార్థ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు) సిద్ధార్థ తన సినిమాల్లో హీరోయిన్లను గారంగా చూసుకుంటాడు. దీంతో అమ్మాయిలంతా ఇది చూసి కొండెక్కి కూర్చుంటున్నారు అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ గురించి కూడా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని డైలాగులు చెప్పాడు. దిల్ రాజు ఒక వైపు ప్రేమ కథ చిత్రాలు తీస్తుంటాడు. మరో వైపు పెద్దల చెప్పిన మాటలు వినాలనే సినిమాలు కూడా తీస్తుంటాడు. ఏం చెయ్యాలో అర్థం కాక యువత తలలు కొట్టుకుంటున్నారు అని ఎన్టీఆర్ ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

బ్రహ్మానందం చేసిన కామెడీకి సినిమాకు ప్రాణంగా నిలిచింది. అలాగే ఒక సన్నివేశంలో ప్రముఖ నటీమణులు సుధ, ప్రగతి, సత్య కృష్ణన్ చేసిన డ్యాన్సులు మాస్ జనాన్ని కేక పెట్టిస్తాయి.