NTR









‘బాద్‌ షా’ క్రెడిట్ శ్రీను వైట్లదే: మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బాద్‌ షా' చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి దర్శకుడు శ్రీను వైట్లతో ఆయనకు ఉన్న చనువే అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. నిన్న ‘బాద్‌ షా' సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘బాద్‌ షా సినిమా చూసాను. చాలా బాగుంది. శ్రీనువైట్ల మార్కు సినినమా. శ్రీను వైట్ల గారు కింగ్ ఆఫ్ ఎంటర్టెన్మెంట్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమా క్రెడిట్ అంతా ఆయనదే' అంటూ మహేష్ బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే.... ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా హీరో జూ ఎన్టీఆర్ ప్రస్తావనే లేక పోవడం.

ఆ విషయం పక్కన పెడితే దర్శకుడు శ్రీను వైట్ల ట్విట్టర్లో జాయిన్ అయిన నేపథ్యంలో...... ఆయన్ను ట్విట్టర్ ప్రపంచంలోకి వెల్ కం చెబుతూ మహేష్ బాబు ట్విట్ చేసారు. మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో 2011లో వచ్చిన ‘దూకుడు' మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రం ‘ఆగుడు' అనే టైటిల్ తో రూపొందబోతోంది. ఎంటర్ టైన్మెంట్ విషయంలో ‘ఆగడు' చిత్రం దూకుడుకి డబల్ డోస్ లా ఉంటుందని శ్రీను వైట్ల వెల్లడించారు. మహేష్ బాబు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ‘ఆగడు' సినిమా ప్లోర్ మీదకు రానుంది.