70 కోట్లు క్రాస్ చేసిన హిందీ ‘బాహుబలి’

నేటితో టాలీవుడ్ గర్వించదగిన ‘బాహుబలి’ మూవీ రిలీజ్ అయ్యి రెండు వారాలు పూర్తవుతుంది. కానీ ఇప్పటికీ ఈ సినిమాకి క్రేజ్ తగ్గలేదు, టికెట్ల కోసం థియేటర్స్ దగ్గర బారులు తీరిన వారి సంఖ్య తగ్గడం లేదు. సౌత్ ఇండియాలోని నాలుగు భాషలు మరియు హిందీలో కలిపి రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. కేవలం తెలుగు ఇరు రాష్ట్రాల్లోనే బాహుబలి 12 రోజుల్లో 80 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. తాజాగా హిందీలోనూ రికార్డ్ సృష్టించింది. మొదటి 13 రోజుల్లో 70 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.