‘బాహుబలి’ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే.!

తెలుగు ప్రేక్షకలతో పాటు తమిళ,మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియా మొదటి భారీ విజువల్ వండర్ ‘బాహుబలి’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఎంతో కష్టపడి చెక్కిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ ‘బాహుబలి – ది బిగెనింగ్’ జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని, సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది. మరోవైపు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం మీకో ఆసక్తిక అంశాన్ని తెలియజేస్తున్నాం. బాహుబలి సినిమా రెండు పార్ట్స్ గా రానుంది. అందులో మొదటి పాటి జూలై 10న వస్తోంది. మరి సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నకు సమాధానంగా ‘ జూలై 10న మొదటి పార్ట్ వస్తుంది, ఏడాది గ్యాప్ తర్వాత ఇదే టైంకి సెకండ్ పార్ట్ వస్తుందని’ రాజమౌళి తెలిపారు. మొదటి పార్ట్ చూసి మెస్మరైజ్ అయిన ఆడియన్స్ సెకండ్ పార్ట్ కోసం మరో ఏడాది వెయిట్ చెయ్యాలనమాట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన ప్రాత్రాలు పోషించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ ఆడియో రిలీజ్ కోసం జూన్ 24వ తీదీని, మలయాళ వెర్షన్ ఆడియో లాంచ్ కోసం జూన్ 27వ ఫైనలైజ్ చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ భారీ బడ్జెట్ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.