సెన్సార్ పూర్తిచేసుకున్న బాహుబలి

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి మొదటి భాగం విడుదలకు ముందే అద్భుతమైన బిజినెస్ చేస్తూ భారతదేశాన్ని నివ్వెరపరుస్తుంది. ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని అందుకుంది.

దీంతో సినిమాకు సంబందించిన కార్యక్రమాలు దాదాపు పూర్తిచేసుకున్న చిత్ర బృందం జులై 10న భారీ విడుదలకు సిద్ధమవుతుంది. సినిమాలో ప్రధాన పాత్రల లుక్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ట్రైలర్ అభిమానుల అంచనాలను పెంచేసింది. కీరవాణి సంగీత దర్శకుడు. ఆర్కా మీడియా సంస్థ నిర్మాత.