‘బాహుబలి’ సెట్స్ చూడటానికి 2 కళ్ళు సరిపోవట.!

తెలుగు చలన చిత్ర సీమతో పాటు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎంతో గర్వించదగ్గ విధంగా హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ,మలయాళ, హిందీ ప్రేక్షకులు కూడా ఎంతగానో చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత రెండున్నర ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఓ విజువల్ వండర్ గా మలిచిన ‘బాహుబలి’ మొదటి పార్ట్ ‘బాహుబలి – ది బిగెనింగ్’ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమా కోసం వేసిన సెట్స్ యొక్క స్కెచ్ లు రిలీజ్ చేసినప్పుడు, అలాగే వాటి రఫ్ అవుట్ పుత్స్ ఇచ్చినప్పుడు అలాగే ట్రైలర్ లో చూపించిన కొన్ని సెట్స్ చూసి ఆడియన్స్ ఎంతో మెస్మరైజ్ అయ్యారు. వారి అంచనాలను మించేలా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ సాబు సైరిల్ కొన్ని విషయాలను రివీల్ చేసారు. ‘మనం రాసుకునే కథకి బయట కొన్ని రెఫరెన్సులు దొరుకుతాయి. కానీ బాహుబలి కథకి ఎలాంటి రెఫరెన్స్ లేదు అంతా మా ఊహ నుంచి పుట్టిందే. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందనేది ఊహించి తీసాం. మహిష్మతి రాజ్యం, రాజభవనం, సభా ప్రాంగణం, విడిది గదులు ఇలా అన్నీ భారీగా ఉంటాయి. మీరు ఆన్ స్క్రీన్ వాటిని చూడటానికి రెండు కళ్ళు చాలవేమో అనే ఫీలింగ్ కలుగుతుందని’ అన్నాడు. మగధీరలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే ఓ రేంజ్ విజువల్స్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించిన రాజమౌళి ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిల్మ్ లో ఇండియన్ ఆడియన్స్ మనసు కొల్లగొడతాడని విశ్లేషకులు అంటున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన ప్రాత్రాలు పోషించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.