ఓవర్సీస్ కి రీచ్ అయిన బాహుబలి హార్డ్ డిస్క్స్

ఒకటిన్నరేళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి రెండు పార్ట్స్ గా సినిమా చేయాలని నిర్ణయించుకొని, అలాగే ఆ రెండు పార్ట్స్ కి 250 కోట్లకి పైనే బడ్జెట్ అవుతుందని లెక్కలు వేసి రెండేళ్ళ పాటు మొదటి పార్ట్ షూటింగ్ చేసిన మొట్ట మొదటి ఇండియన్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ చూపు బాహుబలి పైనే ఉంది. అందరూ ఈ సినిమా వారిని థ్రిల్ చెయ్యడమే కాకుండా విజువల్స్ పరంగా మరో ప్రపంచానికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా జూలై 10న అత్యధిక థియేటర్స్ లో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

భారీ రేంజ్ విజువల్స్ ఉన్న సినిమా కావడం వలన నిన్న సాయంత్రానికి ఈ సినిమా ఫైనల్ కాపీ సిద్దం అయ్యింది. వెంటనే ఈ చిత్ర టీం ప్రింట్స్ ని అన్ని ఎరియాలకి డిస్పాచ్ చేయడం మొదలు పెట్టారు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం వారికి ఈ రోజు ఉదయమే హార్డ్ డిస్క్స్ మరియు ప్రమోషన్స్ కోసం కావాల్సిన కిట్ అందింది. దాంతో వారు అని ప్రీమియర్ షోస్ మరియు రెగ్యులర్ షోస్ ని ఖరారు చేసి బుకింగ్స్ స్టార్ట్ చేసారు.

ప్రభాస్ ని డీ కొట్టే విలన్ గా రానా దగ్గుబాటి కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు.