రాజమౌళిని ప్రశంసించిన చిరు

బాహుబలి విడుదల దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర బృందమంతా దేశమంతా చేరి తమ ప్రచారాలు కొనసాగిస్తున్నాయి. ఈ నెల 10న అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ సినిమా ట్రైలర్ ని చూసి మెగాస్టార్ చిరంజీవిగారు, తారక్ తనకు ఫోన్ చేసి ప్రశంసించారాణి దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించాడు. చిత్రాన్ని తెరకెక్కించడంలో తన కృషి కనబడిందని కితాబిచ్చారట. అంతేకాక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా కలిసి మరీ కృతఙ్ఞతలు తెలిపనట్టు సమాచారం.