ప్రభాస్ కు షాక్ ఇచ్చిన జాతీయ మీడియా వ్యాఖ్యలు !

కొద్ది రోజుల క్రితం ముంబాయి నుండి ప్రచురింప బడే ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ప్రభాస్ పై చేసిన వ్యాఖ్యలు అతడికి తీవ్ర కోపాన్ని తెప్పిఒచినట్లుగా వార్తలు వస్తున్నాయి ‘రానా మినహా మరే పెద్ద స్టార్ లేకున్నా ‘బాహుబలి’ అద్భుతమైన విజయం సాధించింది' అంటూ ఆ ప్రముఖ పత్రిక కామెంట్ చేసింది. దీనికి తోడు బాహుబలి 300 కోట్ల సినిమా కలెక్షన్స్ ను క్రియేట్ చేసినా ఆ సినిమా ద్వారా తనకు రావలిసిన క్రెడిట్ దక్కలేదని ప్రభాస్ మధన పడుతున్నట్లు టాక్.

ఈ మధ్య బెంగుళూరు, ముంబాయి, హైదరాబాద్ ల్లో ఎక్కడ ఏ కార్పొరేట్ కార్యక్రమాలు జరిగినా దాంట్లో చాలామంది ‘బాహుబలి’ గురించి మాట్లాడు కుంటున్నా ప్రశంసలు మాత్రం రానాకే ఎక్కువ వెళ్ళు తున్న విషయం ప్రభాస్ దృష్టికి వచ్చింది అని టాక్. దీనికి తోడు బాలీవుడ్ మీడియాతో ప్రభాస్ కన్నా రానా ఫ్రెండ్లీగా ఉంటూ ఉండటంతో బాలీవుడ్ మీడియా ప్రభాస్ కన్నా రానాకు ఎక్కువ ప్రధానత ఇస్తూ కామెంట్స్ రాస్తోంది.

ఒక జాతీయ సినిమా గా ‘బాహుబలి’ మారిపోయినా ఒక జాతీయ స్టార్ గా ప్రభాస్ ను గుర్తించడంలేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. బాహుబలి క్రేజ్ ను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రభాస్ టేకిటీజీ పాలసీ కూడ కొంతహాని చేసింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవంగా అలోచేస్తే ‘బాహుబలి’ విజయం రాజమౌళికి, రానాకు రమ్య కృష్ణకు తప్ప మరెవ్వరికీ దక్కలేదు అన్న విషయాన్ని ప్రభాస్ చాలా ఆలస్యంగా గ్రహించాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ సినిమా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ ల్లో ఘన విజయం సాధించడం వెనుక ప్రభాస్ అభిమానుల కృషి చల్లా ఉన్నా అది అంత వృథా అయిపోయింది అని ప్రభాస్ అభిమానులు బాధ పడుతున్నలు టాక్. ఈ వాస్తవాలు అన్ని ప్రభాస్ దృష్టికి రావడంతో ‘బాహుబలి’ కి కోపం వచ్చి ఈ సినిమా నిర్మాతలకు ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేయడంతో ఎలర్ట్ అయిన బాహుబలి నిర్మాతలు లేటెస్ట్ గా కేవలం ఒక్క ప్రభాస్ మాత్రమె పాల్గొనే విధంగా హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో అభిమానుల మధ్య ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రభాస్ కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నించారు అని వార్తలు వస్తున్నాయి. దీనితో గతంలో జరిగిన పోరపాట్లను మళ్ళి జరుగకుండా ‘బాహుబలి 2’ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి అని ప్రభాస్ నిర్ణయించు కున్నట్లు టాక్..