Orangeరచ్చ' 50 రోజుల 127 సెంటర్లలో

రామ్ చరణ్ 'రచ్చ' చిత్రం రేపటితో (మే 24) 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నిర్మాతలు ప్రసాద్ - పారస్ జైన్ మాట్లాడుతూ ... రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమా 127 సెంటర్లలో 50 రోజులను పూర్తి చేసుకుంటోందని చెప్పారు. 'రచ్చ' సినిమా ఇంతటి ఘనతని సొంతం చేసుకోవడమే కాకుండా, 100 రోజుల దిశగా పరిగెడుతుండటం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. చరణ్ యాక్షన్ ... తమన్నా అందచందాలు ... సంపత్ నంది టేకింగ్ ... మణిశర్మ సంగీతం ఈ సినిమా సక్సెస్ లో ప్రధాన పాత్ర పోషించాయని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా 45 కోట్ల షేర్ సాధించడం ... అభిమానుల అంచనాలను అందుకోవడం తమకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఆశించిన స్థాయి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేశారు.

Area
Centres
Nizam
16
Ceded +Ballery
37+1=38
Nellore 9
Krishna
8
Guntur
13
Vizag
24
East Godavari
11
West Godavari
8
Total
127